పారిశ్రామిక ఇంజనీరింగ్ సూత్రాలు
1. పనిని మూలమైన భాగములుగా విభజించి ఆ భాగములపై శాస్త్రమును కనుగొన వలెను. యంత్రములు యొక్క మరియు మనుషుల యొక్క పనిలో ఉండే అన్ని విషయములను పరిగణన లోనికి తీసికొనవలెను.
2. శాస్త్ర ఆధారముగా పనిపద్ధతిని మార్చవలెను.
3. కార్మికులను శాస్త్రము ఆధారముగా ఎన్నిక చేయవలెను.
4. కార్మికులకు యాజమాన్యము శాస్త్రీయ పధ్ధతి ఆధారముగా మార్చిన పని విధానమును నేర్ప వలెను.
5. పని అత్యంత సమర్ధవంతముగాని, లాభసాటిగాను ఉండాలంటే యాజమాన్యము, కార్మికులు ఇద్దరూ కూడా పని చేయవలెను. ఎవరు ఏ పని భాగములను చేస్తే లాభమో ఆ భాగములను వారు చెయ్య వలెను.
6. పూర్తి సంస్థ స్థాయిలో సమర్ధవంతముగా మరియు లాభసాటిగా కార్యక్రమము జరిగేలా పారిశ్రామిక సాంకేతిక నిపుణులు పని విధానములను నిర్ణయించాలి.
Presentation in English
________________
________________
No comments:
Post a Comment